16 ఏళ్ల అమ్మాయికి పెళ్లి.. అంతలోనే పోలీసుల ఎంట్రీ

2021-05-24 04:27:10

సొంత బావతో.. 16 సంవత్సరాల అమ్మాయికి పెళ్లి తలపెట్టిన తల్లిదండ్రుల ప్రయత్ననాన్ని కీసర పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆ పెళ్లి కాస్త ఆగిపోయింది. వివరాల్లోకి వెళ్తే.. ఒంగోలుకు చెందిన చిన్న కొండయ్య.. తండ్రి కేశవులు చనిపోడంతో తల్లితో కలిసి నాగారం రాఘవేంద్రకాలనిలో ఉంటూ, మేస్త్రి పని చేస్తూ జీవనము సాగిస్తున్నాడు. చర్లపల్లిలో నివాసం ఉంటున్న కొండయ్య.. చిన్న కొండయ్యకు మేనమామ వరుస అవుతాడు. దీంతో కొండయ్య దంపతులు గత సంవత్సరం 10వ తరగతి పాస్ అయిన తమ 16 ఏళ్ల తమ కూతురును చిన్న కొండయ్యకు ఇచ్చి పెళ్లి చేద్దామని నిశ్చయించుకొన్నారు. ఇందులో భాగంగానే ఈ రోజు రాఘవేంద్రనగర్ కాలనీలోని అబ్బాయి ఇంటిలో రెండు కుటుంబాల వారు, వారి బంధువులు వచ్చి పెళ్లి ఏర్పాట్లలో ఉన్నారు. అయితే పక్క సమాచారంతో.. నాగారం సెక్టార్ ఎస్ఐ నేతృత్వంలోని కీసర పోలీసులు వచ్చి.. ఆ బాల్య వివాహాన్ని ఆపేశారు. అంతేకాదు.. ఆ కుటుంబ సభ్యులు, బంధువులందరికి కౌన్సిల్ ఇచ్చి, తీవ్రంగా పోలీసులు హెచ్చరించారు.

Related News

Logo Logo Logo Logo